Pawan Kalyan: తిరుమలలో మూడు నిద్రలు... ఆపై రాష్ట్రవ్యాప్త పర్యటనకు పవన్ కల్యాణ్!
- నిన్న రాత్రి తిరుమలకు చేరిన పవన్
- మూడు రాత్రులు గడపనున్న జనసేనాని
- ఆపై నేరుగా ఇచ్ఛాపురానికి
- అక్కడి నుంచి బస్సు యాత్ర
నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న పవన్, మూడు రోజుల పాటు తిరుమలలోనే బస చేయాలని నిర్ణయించుకున్నారు. ఎంతో కాలంగా ఆయన తిరుమలలో మూడు నిద్రలు చేయాలని భావిస్తూ వచ్చారని, ఈ మేరకు ఆయనకో మొక్కు ఉందని, ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించాలన్న నిర్ణయం తీసుకున్న ఆయన, అంతకన్నా ముందు మొక్కు తీర్చుకోవాలని భావించారని జనసేన వర్గాలు వెల్లడించాయి.
తిరుమలలో ఉండే మూడు రోజుల్లో ఇక్కడ ఉన్న తీర్థాలు, ఇతర దేవాలయాలను దర్శించుకోవడంతో పాటు భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ఆయన స్వయంగా తెలుసుకుంటారని పార్టీ నేతలు తెలిపారు. మూడు రోజుల తరువాత ఆయన నేరుగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వెళ్లి అక్కడి నుంచి తన యాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇచ్ఛాపురం నుంచి ఆయన బస్సు యాత్ర ప్రారంభమై రాష్ట్రమంతా జరుగుతుందని తెలిపారు.