vishal: విశాల్ కి విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ .. అందరిలో ఆసక్తి!

  • విశాల్ హీరోగా 'సండైకోళి 2'
  • కథానాయికగా కీర్తి సురేశ్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు   
తమిళంలో మాస్ ఇమేజ్ వున్న స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన తన సినిమాలకి కథలను ఎంచుకుంటూ ఉంటాడు. అలాంటి విశాల్ తాజాగా 'ఇరుంబు తిరై'తో హిట్ కొట్టేశాడు. ఈ సినిమా తరువాత ఆయన 'సండైకోళి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

గతంలో విశాల్ కి హిట్ తెచ్చిపెట్టిన 'సండైకోళి' (పందెం కోడి) సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తుండగా, లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. 'పొగరు' సినిమాలో శ్రియారెడ్డి పాత్రను గుర్తుకు తెచ్చేలా వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ఉంటుందని అంటున్నారు. గతంలో విశాల్ .. వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య ప్రేమాయణం కొనసాగిన విషయం కోలీవుడ్లో అందరికీ తెలిసిందే. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లోని ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.     
vishal
keerthi suresh
varalakshmi

More Telugu News