varla ramaiah: 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలి.. లేదంటే వర్ల రామయ్య ఇంటిని ముట్టడిస్తాం: ఎస్సీ విద్యార్థి సంఘం

  • బస్టాండ్‌లో వర్ల రామయ్య అనుచిత వ్యాఖ్యలు
  • టీడీపీ నాయకులు దళితులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం 
  • వారిని హేళన చేయడం సరికాదని వ్యాఖ్య
కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్‌లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య బస్సులోని ఓ యువకుడిని కులం పేరు అడుగుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒంగోలులోని మాదిగ విద్యార్థి సంఘం మండిపడింది. ఆ సంఘ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నరసింగరావు మీడియాతో మాట్లాడుతూ... మాదిగ అంటూ అవమాన పరిచిన ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య రెండు రోజుల్లో  క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. టీడీపీ నాయకులు దళితులపై దాడులకు దిగుతూ వారిని హేళన చేయడం సరికాదని అన్నారు. 
varla ramaiah
sc
Andhra Pradesh

More Telugu News