bhuma akhilapriya: పెళ్లిపీటలు ఎక్కుతున్న మంత్రి భూమా అఖిలప్రియ.. భార్గవతో నిశ్చితార్థం

  • హైదరాబాదులో జరిగిన నిశ్చితార్థం
  • ఇద్దరూ గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నట్టు సమాచారం 
  • మంత్రి నారాయణకు భార్గవ బంధువు
ఏపీ మంత్రి, దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె భూమా అఖిలప్రియ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. భార్గవ్ ను ఆమె పెళ్లాడబోతున్నారు. వీరి నిశ్చితార్థం ఈరోజు హైదరాబాదులోని అఖిలప్రియ నివాసంలో జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల మధ్య ఈ నిశ్చితార్థ కార్యక్రమం వేడుకగా జరిగింది.

వీరి వివాహం ఆగస్టు 29వ తేదీన జరగనుంది. ఏపీ మంత్రి నారాయణ పెద్ద అల్లుడి సోదరుడే భార్గవ్. గత కొద్ది కాలంగా అఖిలప్రియ, భార్గవ ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది.
bhuma akhilapriya
marriage
bhargava
narayana
sambasivarao

More Telugu News