keerthi suresh: 'మహానటి' దర్శక నిర్మాతలను ఇంటికి ఆహ్వానించి.. సత్కరించిన చిరంజీవి!

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'మహానటి'
  • ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ 
  • ప్రముఖుల నుంచి ప్రశంసలు
సావిత్రి జీవితచరిత్రను 'మహానటి' పేరుతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఈ సినిమాను అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్ .. ప్రియాంక దత్ లు నిర్మించారు. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు .. ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. బయోపిక్ అంటే ఇలా ఉండాలి అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన చాలామంది ప్రముఖులు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నారు. మొదటి నుంచి కూడా 'మహానటి'ని తెరకెక్కించే ప్రయత్నాన్ని ప్రశంసిస్తోన్న చిరంజీవి, తాజాగా నాగ్ అశ్విన్ తో పాటు ప్రియాంక దత్, స్వప్నదత్ లను తన ఇంటికి ఆహ్వానించారు. 'మహానటి'ని అందంగా .. హృద్యంగా ఆవిష్కరించడంలో సక్సెస్ అయినందుకు, తెలుగు చిత్రపరిశ్రమ గర్వించదగిన ప్రయత్నం చేసినందుకు అభినందిస్తూ సత్కరించారు.   
keerthi suresh
dulquer

More Telugu News