Chandrababu: చంద్రబాబు డైరెక్షన్ లోనే అమిత్ షాపై దాడి: సోము వీర్రాజు

  • టీడీపీ గూండాలను జైల్లో పెట్టాలి
  • బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టే పని చేస్తున్నారు
  • బీజేపీపై చంద్రబాబు కక్షగట్టారు
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి నేపథ్యంలో టీడీపీ దమననీతి ఏంటో అర్థమవుతోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఈ దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక విధంగా స్పందిస్తే, హోంమంత్రి చినరాజప్ప మరో విధంగా స్పందించారని చెప్పారు. అందుకే టీడీపీని తాను తెలుగు డ్రామా పార్టీగా పిలుస్తానని తెలిపారు. అమిత్ షా పట్ల నిరసన వ్యక్తం చేయడానికి తాము వెళ్తున్నామని మరోవైపు తిరుపతి నగర టీడీపీ అధ్యక్షుడు ప్రకటించారని చెప్పారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు స్టేట్ మెంట్లు ఇచ్చి, కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమిత్ షాపై దాడి చేసిన తెలుగుదేశం గూండాలను జైళ్లలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దాడి వెనుక చంద్రబాబు ఉన్నారని... ఆయన డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.

బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టే పనిని టీడీపీ చేస్తోందని వీర్రాజు అన్నారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిపై దాడి జరగడమంటే మామూలు విషయం కాదని... రోప్ పార్టీని కూడా దాటుకుని టీడీపీ కార్యకర్తలు చొచ్చుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీపై చంద్రబాబు కక్షగట్టారని చెప్పారు. తమ పార్టీపై టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఎదుర్కొనే సత్తా తమకు ఉందని అన్నారు.
Chandrababu
somu veerraju
amit shah
attack

More Telugu News