KCR: ఏపీ ప్రజలను మోసం చేశారు.. అందుకే అమిత్‌ షాపై దాడి!: వీహెచ్‌

  • అమిత్‌ షాపై చిన్నదాడే జరిగింది
  • ఇంకా ముందుంది..
  • బీజేపీ మోసాలు చేస్తోంది 
  • కేసీఆర్‌, మోదీ మధ్య రహస్య ఒప్పందం
ప్రజలను మోసం చేసిన వారు వేంకటేశ్వర స్వామి ఆగ్రహం చవిచూడక తప్పదని కాంగ్రెస్‌ తెలంగాణ నేత వీహెచ్‌ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళుతోన్న భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై అలిపిరి వద్ద టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన వీహెచ్‌.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసినందుకే అమిత్‌ షాపై దాడి చేశారని, అసలు ఆయనపై జరిగింది చిన్నదాడే అని, ఇంకా ముందుంది... అని హెచ్చరించారు. బీజేపీ మోసాలు చేస్తోంది కాబట్టే కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు తెలిపారని చెప్పారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని మోదీ మధ్య రహస్య ఒప్పందం ఉందని, కర్ణాటకలో జేడీఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వ్యాఖ్యానించారు.
KCR
VH
Congress
BJP
amit shah

More Telugu News