Puri Jagannadh: మా పాత 'పూరీ' ఎక్కడ?: 'మెహబూబా' చూసిన ఫ్యాన్స్ రియాక్షన్!

  • నేడు రిలీజైన 'మెహబూబా'
  • అభిమానుల మిశ్రమ స్పందన
  • 'పూరీ ఈజ్ బ్యాక్' అనేలా మాత్రం లేదు
తన కుమారుడిని ఎలాగైనా హీరోగా నిలబెట్టి విజయం సాధించాలన్న పూరీ జగన్నాథ్, తాజా ప్రయత్నం 'మెహబూబా' చిత్రం ఈ ఉదయం విడుదలైంది. నిన్నే హైదరాబాద్ లో యూత్ కోసం ప్రత్యేకంగా చిత్రాన్ని ప్రదర్శించిన పూరీ టీమ్, ఈ ఉదయం ప్రీమియర్ షోలు సైతం వేయగా, చిత్రంపై మిశ్రమ స్పందన వస్తోంది.

సినిమా చూసొచ్చిన అభిమానులు, 'మా పాత పూరీ ఎక్కడ?' అని ప్రశ్నిస్తున్నారు. రెండు జన్మల కథగా, 1971, 2018 సంవత్సరాలను కలుపుతూ తీసిన ఈ చిత్రం 'పూరీ ఈజ్ బ్యాక్' అనే స్థాయిలో లేదట. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని, ఫస్టాఫ్ సాదాసీదాగానే ఉందని, పెద్ద గొప్పగా ఏమీ లేదని సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి సినిమా ఫ్లాప్ అయిందని ట్వీట్లు పెడుతున్నారు.
Puri Jagannadh
Mehabooba
Akash
New Movie

More Telugu News