Mahesh Babu: హీరోగా మహేశ్ బాబు మేనల్లుడు రంగంలోకి దిగుతున్నాడు

  • గల్లా జయదేవ్ తనయుడు అశోక్ 
  • నటన పట్ల ఆసక్తితో శిక్షణ 
  • త్వరలోనే పూజా కార్యక్రమాలు      
తెలుగు తెరపై మహేశ్ బాబు సూపర్ స్టార్ గా వెలుగొందుతూ, తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి హీరోగా రావడానికి మహేశ్ బాబు అన్నయ్య రమేశ్ బాబు తనయుడు జయకృష్ణ రెడీ అవుతున్నాడు. ఇక మరో వైపున గల్లా జయదేవ్ తనయుడు .. మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తన తనయుడిని హీరోగా పరిచయం చేసే ఆలోచన ఉన్నట్టుగా జయదేవ్ ఈ మధ్యనే బయటికి చెప్పారు. అతను అందుకు సంబంధించిన శిక్షణ పొందుతున్నాడని అన్నారు. అశోక్ హీరోగా త్వరలో ఒక సినిమాను లాంచ్ చేస్తున్నట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరు వ్యవహరిస్తారు? కథానాయికగా ఎవరిని ఎంపిక చేయనున్నారు? తదితర వివరాలను త్వరలో వెల్లడి చేయనున్నారు.      
Mahesh Babu
ashok

More Telugu News