Kurnool District: ఫ్యాక్షన్ హత్యతో ఉలిక్కిపడ్డ కర్నూలు... మాజీ ఎంపీ మనవడిని రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

  • మాజీ ఎంపీ ముద్దూరు సుబ్బారెడ్డి మనవడి హత్య
  • మారణాయుధాలు వాడని దుండగులు
  • డోన్ లో ఘటన - పోలీసుల కేసు నమోదు
డోన్ శివార్లలో డాక్టర్ పోచ శ్రీకాంత్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టిచంపడంతో, గత కొంతకాలంగా ఫ్యాక్షన్ ను మరచిన కర్నూలు జిల్లా ఉలిక్కిపడింది. డోన్ గురుకుల పాఠశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. మాజీ ఎంపీ ముద్దూరు సుబ్బారెడ్డి మనవడు, టీడీపీ నేత పోచ ప్రభాకర్ రెడ్డి కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి, వైద్య విద్యను అభ్యసించి, తన సేవలతో ప్రజలకు దగ్గరయ్యారు.

శ్రీకాంత్ రెడ్డి హత్య గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, హత్యకు మారణాయుధాలు వాడకుండా, రాళ్లతో కొట్టి చంపినట్టు తెలుస్తోందని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో పికెటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
Kurnool District
Dhone
Pocha Srikant Reddy
Murder

More Telugu News