YSRCP: కొబ్బరిచిప్పలు దొంగిలించే చరిత్ర బుద్దా వెంకన్నది!: వైసీపీ నేత జోగి రమేశ్

  • ఎమ్మెల్యే రోజాను కించపరిచేలా బుద్దా వెంకన్న మాట్లాడారు
  • గుడిని, గుడిలో లింగాన్ని మింగేసి రకం వెంకన్న
  • చంద్రబాబు తమ నాయకులతో రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు
తమ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. గన్నవరం వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత జోగి రమేశ్ మాట్లాడుతూ, ఓ మహిళా ఎమ్మెల్యేను అగౌరవ పరిచేలా వెంకన్న మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.

గుడిని, గుడిలో లింగాన్ని మింగేసి రకం వెంకన్న అని, గుడిలో కొబ్బరి చిప్పలు దొంగిలించే చరిత్ర ఆయనదని విమర్శించారు. మహిళలను గౌరవించాలంటూ ర్యాలీలు నిర్వహిస్తున్న చంద్రబాబు తమ నాయకుల చేత రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. 
YSRCP
jogi ramesh
Telugudesam
budha venkanna

More Telugu News