Andhra Pradesh: బుల్లెట్ బైక్ పై వెళుతూ యాక్సిడెంట్... అయ్యన్నపాత్రుడి కుమారుడికి గాయాలు!

  • సైకిల్ యాత్రలో అపశ్రుతి
  • పీపీ అగ్రహారం సమీపంలో ప్రమాదం
  • బైకు అదుపుతప్పి కిందపడ్డ విజయ్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన సైకిల్ యాత్రలో భాగంగా ఓ బుల్లెట్ బైక్ పై వెళుతున్న రహదారులు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ ప్రమాదానికి గురయ్యారు. తొలుత కాసేపు మల్లవరం, గిడుతూరు గ్రామాల్లో సైకిల్ తొక్కిన ఆయన, ఆపై అక్కడికి దగ్గర్లోని పీపీ అగ్రహారం చేరుకునేందుకు బుల్లెట్ పై బయలుదేరారు.

ఓ మలుపు వద్ద బండి అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో విజయ్ ఎడమ చెయ్యి విరిగింది. అక్కడే ఉన్న కార్యకర్తలు ఆయన్ను హుటాహుటీన నర్సీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చేతికి కట్టు వేసి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. విజయ్ కి గాయాలైన సంగతి తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు పరామర్శించేందుకు వచ్చారు.
Andhra Pradesh
Telugudesam
Ayyanna Patrudu
Vijay
Road Accident

More Telugu News