Road Accident: పోలీసు వాహనాలను ఢీకొన్న లారీ... కర్ణాటక డీఎస్పీ, సీఐ సహా ముగ్గురి దుర్మరణం!

  • విధుల్లో భాగంగా వెళుతున్న పోలీసులు
  • బాగల్ కోట్ సమీపంలో ఢీకొన్న లారీ
  • అక్కడికక్కడే మరణించిన డీఎస్పీ బాలేగౌడ, సీఐ శివస్వామి
రెండు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, విధుల్లో భాగంగా వెళుతున్న పోలీసు అధికారుల కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. బాగల్ కోట్ సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పోలీసుల వాహనాలను వేగంగా వస్తున్న ఓ లారీ ఢీకొట్టింది. ఇక్కడి సంగమా కూడలిలో జరిగిన ఈ ఘటనలో బెంగళూరు సీఐడీ విభాగం డీఎస్పీ బాలేగౌడ, సీఐ శివస్వామి, వాహనం డ్రైవర్ వేణుగోపాల్ అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ వాసికృష్ణ, డీఎస్పీ గిరీష్ లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉండగా, అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Road Accident
Karnataka
Bagalkot

More Telugu News