Kurnool: నంద్యాలలో దారుణం.. పిలిస్తే పలకలేదని యువకుడి గొంతు కోసిన ఆకతాయిలు

  • యువకుడి గొంతును బ్లేడ్‌తో కోసిన దుండగులు
  • అడ్డొచ్చిన వారిపైనా దాడి
  • యువకుడి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. పిలిస్తే పలకలేదన్న కోపంతో కొందరు ఆకతాయులు ఓ యువకుడి గొంతు కోశారు. రోడ్డుపై వెళ్తున్న రవీంద్ర అనే యువకుడిని పిలిచిన దుండగులు.. అతడు పట్టించుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. వేగంగా అతడి వద్దకు వెళ్లి బ్లేడుతో గొంతు కోశారు.  అడ్డుకోబోయిన వారిపైనా దాడికి తెగబడ్డారు.

అయితే, ఇది పథకం ప్రకారమే జరిగిందని, రవీంద్రను హత్య చేసే ఉద్దేశంతోనే గొంతు కోశారని అతడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడిన రవీంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Kurnool
Nandyal
Andhra Pradesh

More Telugu News