malayali artist: మలయాళ నటి పార్వతి ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. అంతా సేఫ్!

  • కొచ్చి నుంచి త్రివేండ్రం వెళుతుండగా సంఘటన
  • అదుపుతప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టిన వాహనం
  • ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డ పార్వతి
ప్రముఖ మలయాళీ నటి పార్వతి ప్రయాణిస్తున్నవాహనం ప్రమాదానికి గురైంది. అద్దెకు తీసుకున్న ఇన్నోవా వాహనంలో కొచ్చి నుంచి త్రివేండ్రం వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. అలప్పుజా ప్రాంతంలోని జాతీయ రహదారిపై అదుపు తప్పిన ఆమె వాహనం.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో రెండు వాహనాల్లోని వారికి గాయాలు కాలేదని సమాచారం. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, పూ, మర్యన్, బెంగళూరు డేస్, టేకాఫ్ తదితర సినిమాల్లో పార్వతి నటించింది. విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కూడా ఆమె నటించింది.
malayali artist
parvathi

More Telugu News