air odissa: విశాఖ నుంచి జగదల్ పూర్ కు తక్కువ ధరకే విమాన ప్రయాణం

  • ఉడాన్ పథకం కింద ‘ఎయిర్ ఒడిశా’ సేవలు
  • విశాఖ నుంచి ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ కు విమాన సౌకర్యం
  • టికెట్ ధర రూ.1,630 మాత్రమే
సామాన్యులకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చే నిమిత్తం కేంద్ర పౌర విమానయాన శాఖ ఉడాన్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద విశాఖపట్టణం నుంచి ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పూర్ కు వెళ్లేందుకు ‘ఎయిర్ ఒడిశా’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జూన్ 15 నుంచి ఈ మార్గంలో ఎయిర్ ఒడిశా సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు ‘ట్విట్టర్’ ద్వారా ఓ ప్రకటన చేసింది. విశాఖ - జగదల్ పూర్ మార్గంలో ప్రయాణానికి సంబంధించి టికెట్ బుకింగ్స్ ప్రారంభించినట్టు తెలిపింది.

కాగా, ఉదయం 9.10 గంటలకు జగదల్ పూర్ నుంచి బయలుదేరి 9.45 గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి ఈ విమానం చేరుకుంటుందని, తిరిగి మర్నాడు ఉదయం 10.10 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10.50 గంటలకు జగదల్ పూర్ చేరుకుంటుందని, టికెట్ ధర రూ.1,630 మాత్రమే ఉంటుందని ‘ఎయిర్ ఒడిశా’ పేర్కొంది. 
air odissa
Visakhapatnam District
chatisgarh

More Telugu News