Prakash Raj: అధికారం కోసం నరేంద్ర మోదీ దిగజారారు!: ప్రకాశ్‌ రాజ్‌

  • ఎదురు తిరిగే వారిని అణచివేస్తున్నారు
  • ఏ ప్రధానీ చెప్పనన్ని అసత్యాలను మోదీ చెప్పారు
  • ఆయనకు అబద్ధాలకోరు అని బిరుదు ఇస్తున్నాను
అధికారం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగజారారని, ఆయనకు ఎదురు తిరిగే వారిని అణచివేస్తున్నారని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ విమర్శించారు. గతంలో ఏ ప్రధానీ చెప్పనన్ని అసత్యాలను మోదీ చెప్పారని, ఆయనకు అబద్ధాలకోరు అని బిరుదు ఇస్తున్నానని పేర్కొన్నారు. కర్ణాటకలోని మైసూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రకాశ్‌ రాజ్‌ మాట్లాడుతూ... ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, బీజేపీకి తప్ప ఏ పార్టీకయినా ఓటేయండని అన్నారు.

కర్ణాటకలో సీట్ల కోసం బీజేపీ.. అవినీతి పరులను తిరిగి అక్కున చేర్చుకోవటం ఎంత వరకు సరైందని గాలి జనార్దన్‌ రెడ్డి అనుచరులను ఉద్దేశించి ప్రకాశ్‌ రాజ్‌ ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే రెడ్డి సోదరులే ఆధిపత్యం చెలాయిస్తారని, యెడ్యూరప్ప ఓ రబ్బర్‌ స్టాంప్‌ అయిపోతారని అన్నారు.          
Prakash Raj
Narendra Modi
BJP
Karnataka

More Telugu News