forbes: ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితా...తొమ్మిదో స్థానంలో మోదీ

  • ‘ఫోర్బ్స్- 2018 ’ శక్తిమంతుల జాబితా విడుదల
  • మొదటి స్థానంలో నిలిచిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
  • నాలుగేళ్లుగా తొలి స్థానంలో ఉన్న పుతిన్ ఒక అడుగు వెనక్కి
  • మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా ట్రంప్, ఏంజెలా మెర్కెల్

ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోదీ టాప్ టెన్ లో నిలిచారు. 2018 సంవత్సరానికి గాను ‘ఫోర్బ్స్’ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో తొలి స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నిలిచారు. అయితే, గత నాలుగేళ్లుగా ఈ జాబితాలో తొలి స్థానంలో నిలుస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ని వెనక్కి నెట్టి ఆ స్థానాన్ని జిన్ పింగ్ కైవసం చేసుకోవడం గమనార్హం. 

‘ఫోర్బ్స్’ తాజా జాబితాలో పుతిన్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాల్గో స్థానంలో జర్మనీ వైస్ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్, ఐదో స్థానంలో అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్, ఆరో స్థానంలో పోప్ ఫ్రాన్సిస్, ఏడో స్థానంలో ‘మైక్రోసాఫ్ట్’ అధినేత బిల్ గేట్స్, ఎనిమిదో స్థానంలో సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, తొమ్మిదో స్థానంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, పదో స్థానంలో ఆల్పాబెట్ సంస్థ సీఈవో లారీ పేజ్ ఉన్నారు.

More Telugu News