shardul thakur: క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తల్లిదండ్రులకు ప్రమాదం.. తండ్రి పరిస్థితి విషమం!

  • నిన్న రాత్రి ప్రమాదం
  • పెళ్లికి వెళ్లి వస్తుండగా స్కిడ్ అయిన బైక్
  • శార్దుల్ తండ్రి మెదడులో గడ్డకట్టిన రక్తం
టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మహారాష్ట్ర పాల్ఘాట్ లోని అల్యాలిలో ఓ వివాహ వేడుకకు శార్దూల్ తల్లిదండ్రులు నరేంద్ర ఠాకూర్, హౌన్సా హాజరయ్యారు. వేడుక ముగిసిన తర్వాత నిన్న రాత్రి వారు తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా వీరు ప్రయాణిస్తున్న బైక్ స్కిడ్ అయింది.

నిర్మాణంలో ఉన్న భవనం పక్క నుంచి వెళుతుండగా... వీధి దీపాలు లేకపోవడంతో వీరు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో శార్దూల్ తండ్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని డాక్టర్లు తెలిపారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలోనే ఆయనకు రెండు హార్ట్ సర్జరీలు అయ్యాయి.

మరోవైపు శార్దుల్ తల్లి హౌన్సాకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేశారు. ప్రమాదం విషయం తెలియగానే పూణె నుంచి బయల్దేరి లీలావతి ఆసుపత్రికి శార్దూల్ వచ్చాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో అతను చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్నాడు.
shardul thakur
parents
accident
team india

More Telugu News