akash: 'మగధీర'తో 'మెహబూబా'కు ఎలాంటి సంబంధం లేదు: ఆకాశ్

  • 'మగధీర' కథా వస్తువు వేరు 
  • 'మెహబూబా' కథాంశం వేరు 
  • రెండు సినిమాలకి ఎలాంటి పోలిక ఉండదు
తెలుగు తెరపై ప్రేమకథలు ఒకదాని తరువాత ఒకటిగా పుట్టుకొస్తూనే ఉంటాయి .. యూత్ ను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. మనసును తాకే అంశాలు ఉండాలే గానీ .. ఇక ఆ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతూనే వుంటారు. అలాగే, ఓ ప్రేమకథతో 'మెహబూబా ' సినిమా రూపొందింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన తనయుడు ఆకాశ్ హీరోగా నటించాడు. ఈ సినిమా పునర్జన్మతో కూడిన ప్రేమకథతో నడుస్తుందనే టాక్ బయటికి రాగానే, 'మగధీర'తో పోల్చుతూ ప్రచారం మొదలైపోయింది. దాంతో వెంటనే ఆకాశ్ స్పందిస్తూ .. మగధీర కథ వేరు అనీ .. 'మెహబూబా' కథ వేరు అని చెప్పాడు. 'మెహబూబా'లో పునర్జన్మ అనే పాయింట్ ఉన్నప్పటికీ దాని ట్రీట్మెంట్ పూర్తిగా వేరేగా ఉంటుందని అన్నాడు. ఆ సినిమాకి .. ఈ సినిమాకి ఏ విషయంలోను పోలిక వుండదనీ, సినిమా చూశాక ఆ విషయాన్ని అంగీకరిస్తారని చెప్పుకొచ్చాడు.  
akash
neha shetty

More Telugu News