bhumana karunakar reddy: ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై చర్యలు లేవు.. అనుమానాలు కలుగుతున్నాయ్!: భూమన

  • ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్కయ్యారు
  • వాయిస్ ఆయనదే అని ఫోరెన్సిక్ నివేదిక చెబుతోంది
  • అయినా, ఇంత వరకు చర్యలు తీసుకోలేదు
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా బుక్ అయ్యారని... అయినప్పటికీ ఆయనపై ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆడియో ఉన్న వాయిస్ చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ నివేదిక చెప్పినప్పటికీ... చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదని అన్నారు. ఇంత వరకు చంద్రబాబుపై చర్యలు తీసుకోకపోవడంపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికైనా ఈ కేసులో ఉన్న అసలైన దోషులను బయటకు తీయాలని, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. 
bhumana karunakar reddy
Chandrababu
vote for note

More Telugu News