కుమారుడి పెళ్లి వేడుక కోసం ఐదు రోజుల పెరోల్ కోరిన లాలూ
- ఈ నెల 12న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం
- 10 నుంచి 14 వరకు పెరోల్ పై విడుదల చేయాలని కోరిన లాలూ
- పెరోల్ రాకపోతే డిజిటల్ సాధనాలే దిక్కు
ప్రస్తుతం లాలూ జార్ఖండ్ లోని బిర్సాముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇటీవలే ఆయన చికిత్స కోసం కొన్నాళ్ల పాటు ఢిల్లీ ఎయిమ్స్ లో ఉన్న విషయం తెలిసిందే. పెరోల్ మంజూరవుతుందన్న ఆశాభావాన్ని ఆర్జేడీ ఎమ్మెల్యే బోలాయాదవ్ వ్యక్తం చేశారు. పెరోల్ రాకపోతే కనుక డిజిటల్ సాధనాల ద్వారా లాలూ తన కుమారుడి పెళ్లి చూడాల్సి రావచ్చు.