Pawan Kalyan: అల్లు అర్జున్‌ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప‌వ‌న్ కల్యాణ్!

షార్ట్స్‌లో చూడండి
ఈనెల 4న విడుద‌లైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బాగానే వసూళ్లు చేపడుతోంది. దీంతో చిత్ర బృందం ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పేందుకు 'థ్యాక్స్ టూ ఇండియా మీట్' పేరుతో ఓ ఈవెంట్ ని చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప‌వ‌న్ కల్యాణ్ హాజ‌రు కానున్నారు. ఈ ప్రోగ్రామ్ రేపు సాయంత్రం 7గం.లకి ప్రారంభం కానుంది. కాగా, అదే రోజున 'నేల టిక్కెట్టు' ఆడియో వేడుక‌కి కూడా ప‌వ‌న్ కల్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రుకానున్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Allu Arjun
Tollywood
Hyderabad

More Telugu News