Pawan Kalyan: మరో యాత్రకు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్.. ఏకబిగిన రాష్ట్ర పర్యటన!

  • ఇప్పటికే సిద్ధమైన రూట్ మ్యాప్
  • ఒకటి రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల
  • పవన్ కోసం సిద్ధమవుతున్న ప్రత్యేక వాహనం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు ఏపీ యాత్రకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలను కలిపేలా యాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో యాత్ర పేరు, షెడ్యూలు, ప్రారంభ తేదీ, యాత్ర ఎక్కడి నుంచి ప్రారంభం కానుంది? అనే విషయాలను జనసేన వెల్లడించనుంది. అలాగే, యాత్ర రూట్‌మ్యాప్ కసరత్తు కూడా దాదాపు ఖరారైనట్టు సమాచారం. యాత్ర కోసం పవన్‌కు ప్రత్యేకంగా ఓ వాహనాన్ని సిద్ధం చేస్తున్నారు.

యాత్రలో భాగంగా స్థానిక సమస్యలను గుర్తించడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, సమస్యలను గుర్తించిన తర్వాత వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై తీసుకొచ్చే ఒత్తిడితోపాటు, ఆ విషయంలో తమ పార్టీ విధానం ఏంటనేది అక్కడికక్కడే ప్రకటిస్తారని సమాచారం.

వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని ఇప్పటికే పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటన ద్వారా పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ యాత్ర చేపడుతున్నట్టు తెలుస్తోంది.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh

More Telugu News