Jagan: ఓ చిట్టితల్లి తాను రాసిన ఈ చిట్టీని నా చేతికిచ్చింది: జగన్‌

  • కృష్ణా జిల్లాలో జగన్‌ పాదయాత్ర
  • 5వ తరగతి బాలిక లేఖ
  • తమ పూరిళ్లని డాబాలు చేయమని కోరిక
  • అత్యాచారాలు బాగా పెరిగిపోయాయని ఫిర్యాదు
'కృష్ణా జిల్లాలో ఇవాళ్టి పాదయాత్రలో 5వ తరగతి చదువుతున్న ఓ చిట్టితల్లి తాను రాసిన ఈ చిట్టీని నా చేతికిచ్చింది' అని తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఈ రోజు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.  'స్వాగతం సుస్వాగతం జగనన్నకి... మీ అమ్మ ఒడి పథకం చాలా బాగుంది. మా ఇల్లు పూరిల్లు. పూరిళ్లని డాబాలు చేయమని కోరుకుంటున్నాం. రూ.2000 పింఛన్‌ వృద్ధులకు ఇవ్వడం మంచిది. రాష్ట్రంలో అత్యాచారాలు బాగా పెరిగిపోయాయి. ఆడపిల్లల్ని పెద్దన్నలాగా కాపాడుతావని కోరుకుంటున్నాం.. మీ అమ్మగారిని కూడా బాగా చూడమని కోరుకుంటున్నా' అని అందులో ఉంది.
Jagan
Krishna District
YSRCP
Facebook

More Telugu News