varla ramaiah: బీజేపీతో కలిసి చంద్రబాబుపై జగన్ కుట్రలు: వర్ల రామయ్య

  • మోదీని జగన్‌ విమర్శించట్లేదు
  • చంద్రబాబుని మాత్రం విమర్శిస్తున్నారు
  • విజయ సాయిరెడ్డి కర్ణాటకకు వెళ్లి బీజేపీకి ప్రచారం చేశారు
  • ఆయనో బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారు
భారతీయ జనతా పార్టీతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ నేతలకు చంద్రబాబు నాయుడిని విమర్శించే అర్హత లేదని అన్నారు. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కర్ణాటకకు వెళ్లి బీజేపీకి ప్రచారం చేశారని, ఆయనో బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని రామయ్య ఆరోపించారు.

బొత్స సత్యనారాయణ  బ్రాందీ షాప్‌లో సేల్స్ బాయ్‌గా పనిచేశారని, అటువంటి వ్యక్తి చంద్రబాబును విమర్శిస్తున్నారని అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీని వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ఒక్క మాట కూడా అనకుండా చంద్రబాబుపైనే విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
varla ramaiah
BJP
Jagan

More Telugu News