railway: టికెట్ల బుకింగ్‌ విషయంలో రైల్వే శాఖ యోచన.. ఆధార్‌ తప్పనిసరి

షార్ట్స్‌లో చూడండి
అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అవుతోంది. ఇకపై రైలు టికెట్లు బుక్‌ చేసుకోవాలనుకున్నా ఆధార్‌ నెంబర్ ను తప్పనిసరి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. రైల్వే టికెట్ల రాకెట్లను అరికట్టడానికి ఈ విధానాన్ని అవలంబించాలని ఇటీవల రైల్వేశాఖకు సీఆర్‌ఐఎస్‌, ఐఆర్‌సీటీసీ సాంకేతిక నిపుణుల నుంచి సిఫార్సు  వచ్చింది. దీనిపై యోచించిన రైల్వేశాఖ టికెట్‌ బుకింగ్‌కు ఆధార్‌కార్డును తప్పనిసరి చేయాలని అనుకుంటోంది.

ఇటీవల ముంబయిలో రైల్వే టికెట్ల రాకెట్‌ గుట్టు బయటపడడంతో ఓ వ్యక్తిని అరెస్టు చేసి, సుమారు రూ.1.5 కోట్ల విలువ గల ఈ-రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఇటువంటి మోసాలు జరగకుండా యూజర్‌ ఐడీలను వారి ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేయించాలని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. 
Go Back to Shorts
railway
adhar
tickets

More Telugu News