srideve: శ్రీదేవిపై సినిమా కోసం 20 టైటిళ్లు రిజిస్టర్ చేయించిన బోనీ

  • శ్రీదేవి చరిత్రతో సినిమా తీయాలనుకుంటున్న బోనీ కపూర్
  • 'శ్రీ', 'శ్రీదేవి', 'శ్రీ మేడమ్' తదితర టైటిళ్ల రిజిస్ట్రేషన్
  • శ్రీదేవిపై సినిమా తీస్తామని ఇప్పటికే ప్రకటించిన వర్మ, హన్సాల్ మెహతా
తన భార్య శ్రీదేవి చరిత్రతో సినిమా నిర్మించేందుకు నిర్మాత బోనీ కపూర్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వివిధ పేర్లతో 20 టైటిళ్లను ఆయన రిజిస్టర్ చేయించారని సమాచారం. వీటిలో 'శ్రీ', 'శ్రీదేవి', 'శ్రీ మేడమ్' తదితర టైటిళ్లు ఉన్నాయి. అలాగే శ్రీదేవి నటించిన చిత్రాలైన 'చాల్ బాజ్', 'రూప్ కీ రాణీ చోరోంకా రాజా', 'జాన్ బాజ్', 'మిస్టర్ ఇండియా' లాంటి టైటిళ్లను కూడా బోనీ ఈ మధ్యనే రిజిస్టర్ చేయించారట.

ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ, హన్సాల్ మెహతాలు శ్రీదేవి బయోపిక్ తీయాలనే ఆలోచన ఉందని ప్రకటించారు. ఇటీవల మెహతా మాట్లాడుతూ, తన జీవిత కాలంలో శ్రీదేవితో ఒక్క సినిమా కూడా తీయలేకపోయానని, కనీసం ఆమెపైన అయినా సినిమా తీయాలనే ఆశ ఉందని ప్రకటించారు. శ్రీదేవి పాత్రలో విద్యాబాలన్ ను నటించాలని కోరతానని చెప్పారు. ఫిబ్రవరి 24న దుబాయ్ లో బాత్ టబ్ లో పడి శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. 
srideve
boney kapoor
ram gopal varma
hansal mehta
movie
bollywood

More Telugu News