allu arjun: విక్రమ్ కుమార్ వైపు మొగ్గుచూపుతోన్న బన్నీ

  • నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన బన్నీ 
  • అందుబాటులో లేని కొరటాల .. సుకుమార్ 
  • కథలు వినిపిస్తోన్న యువ దర్శకులు
'నా పేరు సూర్య' సినిమాతో అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ కొరటాలతో గానీ .. సుకుమార్ తో గాని సెట్స్ పైకి వెళ్లాలనుకున్నాడు. అయితే సుకుమార్ ఆల్రెడీ మహేశ్ బాబుతో చేయడానికి రెడీయైపోయాడు. ఇక కొరటాల వచ్చి చిరంజీవితో గానీ .. ప్రభాస్ తో గాని చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడు.

ఇద్దరు ముగ్గురు యువదర్శకులు బన్నీకి కథలు వినిపించినప్పటికీ, విక్రమ్ కుమార్ వైపుకే ఆయన మొగ్గు చూపుతున్నాడట. విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ విషయంలోను .. చిత్రీకరణ పరంగాను ఎక్కువ సమయం తీసుకుంటాడనే టాక్ వుంది. అయినా కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తాడనేది అందరికీ తెలిసిన నిజం. అందువలన ఆయనతో సెట్స్ పైకి వెళ్లడానికే సిద్ధపడ్డాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.     

allu arjun
vikram kumar

More Telugu News