'ఆగ్రహ హనుమాన్'ను తొలిసారి చూపించాడు... ప్రధాని మోదీ ప్రశంసలు పొంది ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు!
- కోపంతో నిప్పులు చెరిగే హనుమంతుడి బొమ్మ గీసిన ఆచార్య
- కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన నరేంద్ర మోదీ
- చాలా ఆనందంగా ఉందంటున్న ఆచార్య
ఇక మోదీ నోటి వెంట తన పేరు వచ్చినప్పటి నుంచి తెలిసిన వారంతా కాల్ చేసి అభినందిస్తుంటే, తన జీవితంలో తాను సాధించిన అతిపెద్ద విజయం ఇదేననిపిస్తోందని, తన పెయింటింగ్ ను మోదీ ప్రస్తావించారన్న విషయాన్ని తొలుత తాను నమ్మనేలేదని, ఆపై ఎంతో ఆనందం వేసిందని మీడియాతో చెప్పారు. ఏదైనా వినూత్నంగా చిత్రం గీయాలని ప్రయత్నించి ఈ చిత్రాన్ని గీశానని చెప్పారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం వైరల్ అయిందని, వందలాది కార్లు, బైకులపై తన బొమ్మను చూసుకుంటుంటే పట్టరాని సంతోషం కలుగుతోందని, ఓ కళాకారుడికి ఇంతకన్నా కావాల్సిందేముంటుందని ఆచార్య వ్యాఖ్యానించారు.