Virat Kohli: ఐపీఎల్ లో బెస్ట్ టీమ్ హైదరాబాదేనా? అని అడిగితే తెలివిగా సమాధానమిచ్చిన విరాట్ కోహ్లీ!

  • పది మ్యాచ్ లు ఆడి ఎనిమిది గెలిచిన సన్ రైజర్స్
  • బౌలింగ్ పరంగా అత్యుత్తమ జట్టు
  • ఆల్ రౌండ్ ప్రతిభ మాత్రం సన్ రైజర్స్ దే
పది మ్యాచ్ లు ఆడి ఎనిమిదింట విజయం సాధించి, ప్లే ఆఫ్ కు ఒక్కడుగు దూరంలో ఉన్న హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు, ప్రస్తుత ఐపీఎల్ టీమ్ లో అత్యుత్తమమైన టీమేనా? అని నిన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ కు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీని అడిగిన వేళ, తెలివైన సమాధానం ఇచ్చాడు.

బౌలింగ్ పరంగా సన్ రైజర్స్ టీమ్ ఉత్తమమైనదేనని అంటూనే, బ్యాటింగ్ లోపాలను ఎత్తి చూపాడు. హైదరాబాద్ జట్టును గెలిపిస్తున్నది బౌలర్లేనని, వాళ్లకున్న బలం అదేనని, తమ బలమేంటన్నది వారికి తెలుసునని చెప్పాడు. ఆల్ రౌండ్ ప్రతిభ విషయంలో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ అత్యుత్తమ టీమని చెప్పాడు.
Virat Kohli
IPL
Cricket
Sunrisers
Chennai Superkings

More Telugu News