ramjetmalani: దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ మ్యాజిక్ పని చేయదు: సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలాని

  • మోదీ మాటలు వింటున్న ప్రజలు ఓట్లు మాత్రం వేయరు
  • ఆయనను ప్రధానిగా చేసేందుకు నేను ఎంతో సమయం వెచ్చించా
  • మోదీ ప్రధాని అయినా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మ్యాజిక్ పనిచేయదని, ఆయన మాటలు వింటున్న ప్రజలు ఆనందిస్తున్నారే తప్ప.. ఓట్లు మాత్రం వేయరని సీనియర్ న్యాయవాది రాంజెఠ్మలానీ వ్యాఖ్యనించారు. నరేంద్ర మోదీని ప్రధానిగా చేసేందుకు తాను ఎంతో సమయం వెచ్చించానని, ఇందుకు పశ్చాత్తాపపడుతున్నానని వ్యాఖ్యనించారు. మోదీ దేశ ప్రధాని అయినా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు.

2009 నుంచి మోదీకి తాను అత్యంత నమ్మకస్తుడినైన మిత్రుడిగా ఉన్నానని చెప్పిన ఆయన, గత ఎన్నికల సమయంలో విదేశాల్లో ఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కితీసుకువస్తానని ఇచ్చిన హామీని మోదీ మరిచిపోయారని అన్నారు. అవినీతిపరులకు, జైలుకు వెళ్లిన వారికి బీజేపీ టికెట్లు ఎలా ఇస్తోందని ఆయన ప్రశ్నించారు.

విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చే విషయంలో తాను సుప్రీంకోర్టులో న్యాయపోరాటం ప్రారంభిస్తే, మోదీ తనను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. బీజేపీకి తాను రెండుసార్లు రాజీనామా చేశానని, అటువంటి పరిస్థితులు కల్పించింది మోదీయేనని అన్నారు. 
ramjetmalani
modi

More Telugu News