Karnataka: కారు ప్రమాదం.. కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డేకు స్వల్ప గాయాలు

  • కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా సంఘటన
  • సడన్ బ్రేక్ కారణంగా మంత్రి కారుని ఢీకొట్టిన ఎస్కార్ట్ వాహనం
  • ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కేంద్ర నైపుణ్య శిక్షణల శాఖ మంత్రి, బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే మరోసారి ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటకలోని సిరిసి నుంచి హొన్నా వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు నిన్న ఆయన వెళ్లారు. కుమట యానా క్రాస్ వద్ద ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్ సడన్  బ్రేక్ వేశాడు. దీంతో, ఆ వాహనం వెనుక ఉన్న హెగ్డే  కారు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు.

కానీ, హెగ్డే కారు వెనుక ఉన్న ఎస్కార్ట్ వాహనం మంత్రి కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెగ్డే స్వల్పంగా గాయపడ్డారు. ఇంకెవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ఈ సంఘటనపై కుమట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హెగ్డే ప్రయాణిస్తున్న కారును లారీ ఇటీవల ఢీకొట్టింది.  
Karnataka
anathkumar hegde

More Telugu News