Virat Kohli: సహచర ఆటగాళ్లకు సిరాజ్ విందు.. టీవీ చూస్తూ హైదరాబాద్‌ బిర్యానీ లాగించిన కోహ్లీ!

  • హైదరాబాద్‌కు వచ్చిన బెంగళూరు టీమ్‌
  • క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో కోహ్లీ టీమ్‌ సందడి
  • హైదరాబాద్‌ వంటకాల రుచి చూసిన క్రికెటర్లు
హైదరాబాద్ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు సందడి చేశారు. గతేడాది హైదరాబాద్ టీమ్‌ తరఫున ఆడిన సిరాజ్.. ఈ సారి బెంగళూరు టీమ్‌ తరఫున ఆడుతోన్న విషయం తెలిసిందే. కాగా, ఈ సారి ఇప్పటివరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో బెంగళూరు ఈ రోజు రాత్రి కీలక మ్యాచ్ ఆడనుంది.

ఈ సందర్భంగా బెంగళూరు టీమ్‌ హైదరాబాద్‌ చేరుకుంది. ఆ టీమ్‌ సారథి విరాట్‌ కోహ్లీతో పాటు కొందరు ఆర్సీబీ ఆటగాళ్లు టోలిచౌక్‌లోని సిరాజ్‌ ఇంటికి చేరుకుని, హైదరాబాద్ బిర్యానీతో పాటు ప్రత్యేక వంటకాలను లాగిస్తూ, టీవీ చూస్తూ ఎంజాయ్‌ చేశారు. కోహ్లీతో పాటు ఇతర క్రికెటర్లు అందరూ కిందే కూర్చుని ముచ్చట్లాడుతూ వంటకాల రుచి చూశారు.     
Virat Kohli
Cricket
Hyderabad

More Telugu News