savitri: ఒక దశలో సావిత్రి నన్ను అపార్థం చేసుకుంది: 'షావుకారు' జానకి

  • సావిత్రిని సినిమాల్లోకి రాకముందే చూశాను
  • సంసారం'లో చిన్నపాత్ర వేసింది 
  • 'దేవదాసు'లో పార్వతి పాత్ర ముందుగా నాకు వచ్చింది  
తెలుగు తెరపై సహజమైన నటనను ఆవిష్కరించిన నటీమణులలో షావుకారు జానకి ఒకరు. కథానాయికగాను .. ఆ తరువాత ముఖ్యమైన పాత్రల్లోను అద్భుతమైన హావభావాలతో ఆమె ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి 'షావుకారు' జానకి తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రితో తనకి గల అనుబంధం గురించి ప్రస్తావించారు. " జెమినీ సంస్థ వారు నిర్మించే 'ముగ్గురు కొడుకులు' సినిమాలో వేషం కోసం నేను అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ నాకు గణేశన్ పరిచయమయ్యాడు. ఆ సినిమాలో నాకు అవకాశం వచ్చేలా చేశాడు""అందువలన నేను ఆయనను బ్రదర్ అని పిలిచేదానిని. ఆయన నాకు అద్దె ఇల్లు చూపించే క్రమంలో నేను సావిత్రిని మొదటిసారి చూశాను. అప్పటికి ఆమె ఇంకా సినిమాల్లోకి రాలేదు. 'సంసారం'లో చిన్న పాత్ర ద్వారా పరిచయమైన సావిత్రి .. 'దేవదాసు'లో నేను చేయవలసిన పార్వతి పాత్రను చేసింది. ఆ తరువాత ఇద్దరం కలిసి వరుస సినిమాల్లో నటించాం. ఒకానొక దశలో గణేశన్ తో నేను చనువుగా ఉండటాన్ని సావిత్రి అపార్థం చేసుకుంది. ఆ తరువాత నేను ఆమెకి అసలు విషయం చెప్పడంతో మన్నించమని కోరింది. ఆమె నటనను ఆనాటి నటీనటులంతా ఆరాధించేవాళ్లు" అని చెప్పుకొచ్చారు.  
savitri
shavukaru janaki

More Telugu News