Puri Jagannadh: 'మెహబూబా' కొత్త దర్శకుడు తీసినట్టుగా ఉంటుంది!: పూరీ జగన్నాథ్

షార్ట్స్‌లో చూడండి
పూరీ జగన్నాథ్ కి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. అయినా ఆయన డీలాపడిపోకుండా తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమాను చేశాడు. నేహా శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ "ఈ కథ పూర్వ జన్మల నేపథ్యంలోని ప్రేమకథగా కొనసాగుతుంది. టేకింగ్ పరంగా చూస్తే .. ఎక్కడా నా శైలి కనిపించదు. ఎవరో కొత్త దర్శకుడు తీసినట్టుందే అనిపిస్తుంది. అంతగా నా పాత పద్ధతి ఎక్కడా బయటపడకుండా చూసుకున్నాను. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకి .. ఈ సినిమాకి మధ్య ఎలాంటి పోలిక ఉండదు. ఈ సినిమా హీరోగా ఆకాశ్ కి మంచి పేరు తెచ్చిపెడుతుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Puri Jagannadh
akash

More Telugu News