neet: పాలకులకు ప్రజలే గుణపాఠం చెబుతారు: సంచలనం రేపుతున్న హీరో విశాల్ ట్వీట్

  • తమిళనాడులో మరణాలకు కారణమవుతున్న నీట్ పరీక్ష
  • పాలకులపై మండిపడ్డ హీరో విశాల్
  • మహాలింగం కుటుంబాన్ని ఆదుకుంటా
పాలకులను ఉద్దేశించి సినీ హీరో, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నీట్ పరీక్షల నేపథ్యంలో అనిత దగ్గర నుంచి కృష్ణసామి వరకు జరిగిన మరణాలకు పాలకులే కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలకులకు ప్రజలు గుణపాఠం చెప్పితీరుతారని అన్నారు. నీట్ పరీక్ష కోసం కస్తూరి అనే విద్యార్థిని కేరళకు తీసుకెళ్లిన అతని తండ్రి కృష్ణసామి గుండెపోటుకు గురై మరణించారు. ఈ నేపథ్యంలోనే విశాల్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణసామి మరణంతో అనాథగా మిగిలిపోయిన మహాలింగం కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  
neet
vishal

More Telugu News