Puri Jagannadh: నమ్మకం వుంది.. అందుకే ఇల్లు అమ్మేశా!: పూరీ జగన్నాథ్

షార్ట్స్‌లో చూడండి
పూరీ జగన్నాథ్ నుంచి ఒక సినిమా వస్తుందీ అంటే .. మాస్ ఆడియన్స్ కి పండగే. అందుకే వాళ్లంతా ఆయన తాజా చిత్రమైన 'మెహబూబా' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా .. తనే దర్శక నిర్మాతగా ఈ సినిమాను పూరీ రూపొందించాడు. ఈ సినిమా కోసం ఆయన తనకి గల ఇళ్లలో నుంచి ఒక ఇంటిని అమ్మేసినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది.

తాజాగా ఈ విషయాన్ని గురించి పూరీ దగ్గర ప్రస్తావించగా, 'మెహబూబా' సినిమా కోసం ఇల్లు అమ్మేసిన మాట నిజమేనని చెప్పాడు. కొత్త కుర్రాడిపై డబ్బులు ఖర్చు చేయడానికి ఏ నిర్మాతైనా ఆలోచిస్తాడు .. ఒకవేళ ముందుకు వచ్చినా అనేక ఆంక్షలు ఉంటాయి. అందువలన అలాంటివి ఉండకూడదనే నేను ఒక ఇల్లు అమ్మేశాను. ఈ సినిమా కంటెంట్ మీద .. ఆకాశ్ మీద నాకు నమ్మకం వుంది .. అందుకే అలా చేశాను. ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను .. ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో నాకు తెలుసు" అని చెప్పుకొచ్చారు.    
Go Back to Shorts
Puri Jagannadh

More Telugu News