Tollywood: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నాయకుడి లక్షణం కాదు!: సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి

  • ఈ దశలో మనం మనమూ కొట్టుకోకూడదు
  • దెబ్బలాడుకుంటుంటే కేంద్రం నవ్వుకుంటోంది
  • అందరం కలుద్దాం..ఒకే గొంతు వినిపిద్దాం
  • కేంద్రం దిగి రావాలి .. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం నాయకుడి లక్షణం కాదని ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని నాడు మోదీ ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పాలకుడి లక్షణం అని అన్నారు.

ప్రత్యేక హోదా సాధన విషయంలో ఒక పార్టీని మరొక పార్టీ విమర్శించుకుంటూ, గొడవలు పడుతూ, దెబ్బలాడుకుంటూ ఉంటే పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆనందపడుతోందని, నవ్వుకుంటోందని విమర్శించారు. ఈ దశలో మనం మనమూ కొట్టుకోకూడదని, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు తమ జెండాలను పక్కనపెట్టి ‘ప్రత్యేక హోదా’ కోసం పోరాడితే..సాధించి తీరతామని అన్నారు. ‘అందరం కలుద్దాం..ఒకే గొంతు వినిపిద్దాం. కేంద్రం దిగి రావాలి .. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అని నారాయణమూర్తి అన్నారు.

More Telugu News

Tollywood
r.narayana murthy