Karnataka: కర్ణాటకలో బీజేపీ విజయం ఖాయం : సోము వీర్రాజు జోస్యం

  • బీజేపీపై టీడీపీ నేతల దుష్ప్రచారం తగదు
  • ఏపీకి ‘ప్రత్యేకహోదా’ వద్దన్న బాబు నేడు కావాలంటున్నారు!
  • ఏపీలో టీడీపీ అవినీతి పరిపాలనను అంతం చేస్తాం
  • సుపరిపాలన తీసుకొస్తాం
కర్ణాటక రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఏపీ నేత సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అడిగితే కేసులు పెడతామని నాడు చంద్రబాబు అన్నారని, ఇప్పుడేమో ‘హోదా’ కావాలనడం సబబు కాదని అన్నారు. సుపరిపాలన తీసుకొచ్చే వారితో కలిసి తాము పోటీ చేస్తామని చెప్పిన ఆయన, ఏపీలో టీడీపీ అవినీతి పరిపాలనను అంతం చేస్తామని, మంచిపరిపాలనను తాము తీసుకొస్తామని అభిప్రాయపడ్డారు. 
Karnataka
somu veeraj
Andhra Pradesh

More Telugu News