Mukesh Goud: నా సెల్ ఫోన్ కు అసభ్య మెసేజ్ లు... పోలీసులకు ఫిర్యాదు చేసిన ముఖేష్ గౌడ్ కోడలు షిఫాలీ

  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు
  • ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు
  • విచారిస్తున్నామన్న పోలీసులు
తన సెల్ ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ భార్య షిఫాలీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 20న ఓ అపరిచిత వ్యక్తి నుంచి తనకు అభ్యంతరకరమైన మెసేజ్ వచ్చిందని, అప్పట్లో దాన్ని పట్టించుకోలేదని పేర్కొన్న ఆమె, తిరిగి ఈనెల 1న అదే తరహా మెసేజ్ వచ్చిందని తెలిపారు.

 కాగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు నివసించే కాలనీలో విక్రమ్ గౌడ్ నివాసం ఉంటున్నారు. షిఫాలీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి, అసభ్యకరమైన మెసేజ్ లు పంపించిన అపరిచితుడు ఎవరన్న విషయమై దృష్టిని సారించారు. కేసును విచారిస్తున్నామని అధికారులు తెలిపారు.
Mukesh Goud
Vikram Goud
Shifali
Cell Phone

More Telugu News