Rajanikant: రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు... రంగంలోకి దిగిన పోలీసులు!

  • పోయిస్ గార్డెన్ ఇంటిలో బాంబుందని ఫోన్
  • సోదాల అనంతరం లేదని తేల్చిన పోలీసులు
  • అమెరికా నుంచి రజనీ రాగానే ఘటన
సూపర్‌ స్టార్‌ ర‌జ‌నీకాంత్ నివాసముండే చెన్నై పోయిస్ గార్డెన్ ఇంటిలో బాంబు పెట్టామని, అది ఏ క్షణమైనా పేలుతుందని వచ్చిన ఫోన్ కాల్ తో పోలీసులు రంగంలోకి దిగారు. ఆగమేఘాల మీద ఆయన ఇంటికి చేరుకుని సోదాలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చిన పోలీసులు, సోదాల అనంతరం ఎటువంటి బాంబు లేదని నిర్ధారించారు.

గతంలో సీఎం పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపు ఫోన్ కాల్ చేసి పట్టుబడిన దిలీప్ అనే వ్యక్తే, ఇప్పుడీ కాల్ చేసుంటాడని అనుమానిస్తున్న పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు. కాగా, అమెరికాలో వైద్య పరీక్షల అనంతరం నిన్న రజనీకాంత్ చెన్నై చేరుకున్నారన్న సంగతి తెలిసిందే.
Rajanikant
Chennai
Tamilnadu
Bomb
Posani Krishna Murali

More Telugu News