NTR: ఎన్టీఆర్ పెళ్లిరోజు వేడుకల్లో రామ్ చరణ్, ఉపాసన... ఫొటో, వీడియోలు చూడండి!

  • మ్యారేజ్ డే జరుపుకున్న ఎన్టీఆర్, ప్రణతి
  • వేడుకల్లో అతిథులుగా రామ్ చరణ్ దంపతులు
  • ఫాలో ఫాలో యూ పాటపాడిన ఎన్టీఆర్ కుమారుడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి మ్యారేజ్ డే వేడుకల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ముఖ్య అతిథులయ్యారు. ఈ ఫొటోలను, ఓ చిన్న వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ తనయుడిని తన ఒళ్లో కూర్చోపెట్టుకున్న ఉపాసన, రామ్ చరణ్ భుజంపై చెయ్యి వేసిన ఎన్టీఆర్ ఉన్న ఫొటో పోస్ట్ అయిన తరువాత మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ వారసుడు "ఫాలో ఫాలో యూ..." పాట పాడిన వీడియోనూ ఉపాసన పోస్ట్ చేశారు. ఈ పిక్, వీడియో చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదంటున్నారు అభిమానులు.
NTR
Ramcharan
Upasana
Pranati
Marriage Day

More Telugu News