Andhra Pradesh: ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు నిరసనగా వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ.. పాల్గొన్న జగన్

  • కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో పాల్గొన్న జగన్
  • ఏపీ సర్కారుపై విమర్శలు
  • నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై జరుగుతోన్న దారుణాలకు నిరసనగా ఏపీలోని అన్ని జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి.. కృష్ణా జిల్లా పెడన నియోజక వర్గంలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఏపీలో మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగిపోతున్నాయని, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితులకు న్యాయం చేకూర్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీ నేతలే మహిళలపై దాడులకు దిగుతున్నారని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  
Andhra Pradesh
YSRCP
Telugudesam

More Telugu News