suicide: ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని.. యువకుడి బలవన్మరణం

  • వనపర్తి జిల్లాలో ఘటన
  • ప్రేమికులని మందలించిన పెద్దలు
  • పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
వనపర్తి జిల్లాలోని కొత్తకోట మండలం అప్పరాల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి సుశ్మితా రెడ్డి (19) ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న విక్రమ్‌ నాయుడు అనే యువకుడు ఆత్మకూరు మండలం శ్రీరాంనగర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి, రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు పట్టాలపై పడుకున్న సమయంలో తన కుటుంబ సభ్యులకు ఫొన్ చేసి తాను చనిపోతున్నానని చెప్పాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... వీరిద్దరు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారని, రెండేళ్ల క్రితం ఇరువురికి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో వారిని హెచ్చరించారని చెప్పారు.

అయినప్పటికీ వారిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటుండడంతో చూసిన అమ్మాయి కుటుంబ సభ్యులు ఆమెను గట్టిగా హెచ్చరించారని దీంతో ఆ యువతి, ఇంట్లో పురుగుల మందును తాగి ఈ ఘటనకు పాల్పడిందని చెప్పారు. ఈ విషయం తెలసుకుని ప్రియుడు విక్రమ్‌ నాయుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
suicide
vanaparthy

More Telugu News