Chandrababu: అమరావతిని చూశాకే ప్రాణులు వదులుతా: చంద్రబాబుతో వృద్ధురాలు

  • అమరావతిలో చంద్రబాబును కలిసిన నడింపాలెం గ్రామ పెన్షనర్లు
  • రాజధాని నిర్మాణానికి తమ మొదటి పెన్షన్లు విరాళం
  • అమరావతిని చంద్రబాబు నిర్మాస్తారన్న ఆదెమ్మ అనే వృద్ధురాలు
అమరావతిని తమరే నిర్మించాలని, దాన్ని చూశాకే తనువు చాలిస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆదెమ్మ అనే వృద్ధురాలు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పలువురు పెన్షనర్లు ఈరోజు అమరావతికి వచ్చి చంద్రబాబును కలిశారు. వారు అందుకుంటున్న తమ మొదటి పింఛన్లు రూ. 40 వేలను అమరావతి నిర్మాణానికి విరాళంగా ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో ఆదెమ్మ అనే పింఛనుదారు మాట్లాడుతూ, పింఛన్లను ఇచ్చి ఒక పెద్ద కొడుకులా తమను ఆదుకున్నారని చంద్రబాబును ప్రశంసించారు. ఎన్ని అడ్డంకులైనా అమరావతిని చంద్రబాబు నిర్మిస్తారని, దాన్ని అందరూ చూస్తారని చెప్పారు.
Chandrababu
amaravati
donation

More Telugu News