Andhra Pradesh: టీడీపీకి కన్నబాబు రాజీనామా.. ఈరోజు వైసీపీలో చేరనున్న వైనం!

  • టీడీపీకి గుడ్ బై చెప్పిన కన్నబాబు, ఆయన కుమారుడు వర్మ
  • చంద్రబాబుకు తమ రాజీనామా లేఖలు పంపామన్న వర్మ
  • కన్నబాబుకు నచ్చజెప్పేందుకు టీడీపీ నేతల విఫలయత్నం
తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం జిల్లా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, ఆయన కుమారుడు సుకుమార వర్మ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమ రాజీనామా లేఖలను టీడీపీ అధిష్ఠానానికి అందజేశారు. ఈ సందర్భంగా సుకుమార వర్మ మాట్లాడుతూ, తమ రాజీనామా లేఖలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి, రాష్ట్ర, రూరల్ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్ బాబుకు పంపామని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఈరోజు సాయంత్రం పార్టీ కండువా కప్పుకుంటామని చెప్పారు. కాగా, వైసీపీలో చేరతానని ప్రకటించిన కన్నబాబుకు మంత్రి గంటా శ్రీనివాసరావు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. కన్నబాబు యలమంచిలి ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు.
Andhra Pradesh
Telugudesam
kannababu
YSRCP

More Telugu News