tippu sultan: టిప్పు సుల్తాన్ కు పాకిస్థాన్ జేజేలు... కర్ణాటక ఎన్నికల ముందు కొత్త ఎత్తుగడ

  • బ్రిటిషర్లపై పోరాడిన తొలి నేత టిప్పు
  • ఆయన జీవితంపై వీడియో పోస్ట్
  • పాకిస్థాన్ ప్రభుత్వ చర్యలు
భారత్ విషయంలో పాకిస్థాన్ కొత్త ఎత్తుగడలకు దిగింది. ఒకప్పుడు మైసూరు సంస్థానాన్ని ఏలిన టిప్పు సుల్తాన్ ను ఆయన 218వ జయంతి సందర్భంగా మెచ్చుకుంటూ కీలకమైన కర్ణాటక ఎన్నికల ముందు ప్రకటన చేసింది. మైసూర్ పులిగా అభివర్ణించింది. పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ పేజీలో దీనిపై వరుస ట్వీట్లు పెట్టింది. ముఖ్యమైన, ప్రభావవంతమైన చరిత్రాత్మక వ్యక్తిగా టిప్పును పేర్కొంటూ ఒక ట్వీట్ లో పేర్కొంది. బ్రిటిష్ పాలకులపై పోరాడిన తొలి వ్యక్తిగానూ అభివర్ణిస్తూ మరో ట్వీట్ చేసింది. టిప్పు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఇప్పటికే పోరు నడుస్తున్న విషయం విదితమే. చిన్న వయసు నుంచే యుద్ధ విద్యల్లో శిక్షణ పొందినట్టు పేర్కొంటూ ఆయనకు సంబంధించి వీడియోనూ పోస్ట్ చేసింది. 
tippu sultan
pakistan

More Telugu News