charan: బోయపాటి షూటింగ్ అందుకే వాయిదాలు పడుతోందట!

  • చరణ్ హీరోగా బోయపాటి మూవీ 
  • మొదలుకాని రెండవ షెడ్యూల్ 
  • ఇదే కారణమంటూ టాక్
చరణ్ హీరోగా బోయపాటి సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రిందటే మొదలైపోయింది. 'రంగస్థలం' సినిమా షూటింగులో చరణ్ బిజీగా ఉండటం వలన, ఇతర పాత్రలకి సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేసుకుని ఫస్టు షెడ్యూల్ ను బోయపాటి పూర్తి చేశాడు. ఇక రెండవ షెడ్యూల్లో చరణ్ .. హీరోయిన్ కైరా అద్వాని పాల్గొంటారనే వార్తలు వచ్చాయి.

అయితే రెండవ షెడ్యూల్ ను ప్లాన్ చేసిన మూడుసార్లు కూడా షూటింగును వాయిదా వేసేశారట. షూటింగ్ కోసం వచ్చిన కైరా అద్వాని మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం జరుగుతూ వస్తోందట. ఇందుకు కారణం స్క్రిప్ట్ విషయంలో చరణ్ చెప్పిన మార్పులు .. చేర్పులు కారణమని సమాచారం. 'రంగస్థలం' సక్సెస్ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం చరణ్ చెప్పిన మార్పుల కారణంగానే షూటింగు ఆలస్యమవుతోందట. ఈ విషయంలో చరణ్ ను బోయపాటి మెప్పిస్తే .. రెండవ షెడ్యూల్ మొదలైపోతుందని అంటున్నారు. 
charan
kiara advani

More Telugu News