Police: ఉన్నావో, కథువా ఘటనల్లో లభించని న్యాయం మాకు లభించింది: దాచేపల్లి బాధితురాలి బంధువు

  • ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది
  • ముందు కేసు పెట్టాలా? వద్దా? అని ఆలోచించాం
  • చివరకు న్యాయం కోసం కేసు పెట్టాం 
  • రేపిస్టులని బహిరంగంగా ఉరి తీసే చట్టాలు రావాలి
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో, జమ్ముకశ్మీర్‌లోని కథువాల్లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనల్లో బాధితులకి లభించని న్యాయం తమకు లభించిందని గుంటూరు జిల్లాలోని దాచేపల్లి అత్యాచార బాధితురాలి బంధువు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు. ఈ రోజు చంద్రబాబు నిర్వహించిన మీడియా సమావేశంలో దాచేపల్లి బాధితురాలి బంధువు ఒకరు కాసేపు మాట్లాడాడు.

ఏపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో తమకు న్యాయం జరిగిందని తెలిపాడు. ఈ ఘటన తమకు తెలియగానే ముందు కేసు పెట్టాలా? వద్దా? అనే విషయంపై ఆలోచించామని, చివరకు న్యాయం కోసం కేసు పెట్టామని తెలిపాడు. ఇటువంటి ఘటనలు ఎక్కడా జరగకుండా ఉండాలంటే అత్యాచారాలకి పాల్పడ్డ వారిని బహిరంగంగా ఉరి తీసే చట్టాలు రావాలని వ్యాఖ్యానించాడు.   
Police
Guntur District
Chandrababu

More Telugu News